Tuesday, June 1, 2010

Revo Uninstaller - ’Add or Remove Programs' కి ప్రత్యామ్నాయ యుటిలిటీ...

మన పీసీ లోని ఎదైనా ప్రోగ్రామ్ ని తొలగించటానికి Control Panel లోని ’Add or Remove Programs' ని ఉపయోగిస్తూవుంటాం. ఒకవేళ ’Add or Remove Programs' ఏదైనా ప్రోగ్రామ్ ని తొలగించటం లో విఫలమైనప్పుడు దానికి ప్రత్యామ్నాయమైన Revo Uninstaller అనే ఉచిత యుటిలిటీని ఉపయోగించి దానిని తొలగించవచ్చు. Revo Uninstaller డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాత ప్రోగ్రాం లాంచ్ చేస్తే మన పీసీ లో ఇనస్టలేషన్ చెయ్యబడిన ప్రోగ్రామ్స్ యొక్క ఐకాన్లను చూపిస్తుంది, అలాకాకుండా ఆ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఇనస్టలేషన్ తేదీ, సైజ్, వెర్షన్ తదితర వివరాలు తెలుసుకోవాలంతే View లోని Details పై క్లిక్ చెయ్యాలి. ఇక ఇప్పుడు కావలసిన ప్రోగ్రామ్ ని తొలగించటం కోసం దానిని సెలెక్ట్ చేసుకొని మెయిన్ మెనూ లోని ’Uninstall' పై క్లిక్ చెయ్యాలి. అలా కాకుండా తొలగించవలసిన ప్రోగ్రామ్ పై మౌస్ రైట్ క్లిక్ చేసి ’Uninstall' సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ మౌస్ రైట్ క్లిక్ చెయ్యగా వచ్చే కమాండ్లతో ప్రోగ్రామ్ కి సంబంధించిన రిజిస్ట్రీ కీ ఓపెన్ చెయ్యటం, గూగుల్ లో వెతకటం, ఇనస్టలేషన్ చేసిన లొకేషన్ కి వెళ్ళటం మొదలగునవి చెయ్యవచ్చు.




Revo Uninstaller కి సంబంధించిన సమాచారం కోసం ఇక్కడ చూడండి.

డౌన్లోడ్: Revo Uninstaller

ధన్యవాదాలు