Friday, November 25, 2011

2-step verification సహాయంతో మీ గూగుల్ అకౌంట్ ని సురక్షితంగా ఉంచుకోండి!

ఒక్క గూగుల్ అకౌంట్ తో మనం వివిధ వెబ్ సైట్లలో సైన్-ఇన్ అవుతూ ఉంటాం ...ఒక్కొక్కసారి పబ్లిక్ లేదా షేర్డ్ పీసీ లలో సైన్-ఇన్ కూడా అవ్వటం జరుగుతుంది. కాబట్టి మన గూగుల్ అకౌంట్ సురక్షితంగా ఉంచుకోవటం కోసం 2-step verification సహాయపడుతుంది. దీనిని సెట్ చేసుకోవటం కోసం గూగుల్ అకౌంట్ సైన్-ఇన్ అయిన తర్వాత ’Account Settings' కి వెళ్ళి అక్కడ 'Security' దగ్గర ఉన్న 'Using 2-step verification ' పై క్లిక్ చేసి ’Start Setup' పై క్లిక్ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కోడ్స్ Text లేదా  Voice Call ఏదికావాలో సెలెక్ట్ చేసుకొని ’Send Code' పై క్లిక్ చేస్తే కోడ్ మొబైల్ కి పంపబడుతుంది, దానిని 'Enter Code...' దగ్గర ఎంటర్ చేసి ’Verify' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత స్టెప్ లో కోడ్ కంప్యూటర్ గుర్తు పెట్టుకోవాలా వద్దా అనే చెక్ బాక్స్ వస్తుంది, బాక్స్ చెక్ చేస్తే కోడ్ 30 రోజులవరకు ఎంటర్ చెయ్యవలసిన పనిలేదు. అయితే పబ్లిక్ లేదా షేర్డ్ పీసీ లలో ఈ ఆప్షన్ ని ఎంచుకోవద్దు. తర్వాత Turn on 2-step verification పై క్లిక్ చేస్తే సెటప్ పూర్తి అవుతుంది.

ఇది ఎలా పనిచేస్తుందో ఈ క్రింది వీడియో లో చూడండి:



2-step verification పై మరింత సమాచరం కోసం గూగుల్ సైట్ చూడండి.

ధన్యవాదాలు